Header Banner

ఇకపై మైక్రోసాఫ్ట్ అకౌంట్స్‌కి పాస్‌వర్డ్ అవసరం లేదు! మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం!

  Fri May 02, 2025 18:19        Business

బ్యాంక్ అకౌంట్, ఈమెయిల్ అకౌంట్, విండోస్ అకౌంట్, మొబైల్ లాగిన్.. ఇలా ప్రతి సందర్భంలోనూ పాస్ వర్డ్స్ మనం వాడుతుంటాము. పాస్‌వర్డ్స్‌తో మన అకౌంట్స్ భద్రమని నమ్ముతాము. అయితే, పాస్‌వర్డ్స్ ఆధారంగా సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థలన్నీ పాస్‌కీస్ వైపు మళ్లుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై మైక్రోసాఫ్ట్ అకౌంట్స్‌కు పాస్‌వర్డ్స్ అవసరం లేదని పేర్కొంది. వినియోగదారులు పాస్‌కీల వైపు మళ్లాలని కూడా సూచిస్తోంది. పాస్‌వర్డ్స్‌ వినియోగానికి ముగింపు పలకాలని నిశ్చయించుకున్న సంస్థ ఇకపై వినియోగదారులు తమ అకౌంట్‌లల్లో లాగిన్ కోసం బయోమెట్రిక్ ఆథెంటికేషన్, సెక్యూరిటీ కీస్, పిన్ నంబర్ల వంటివాటిని వినియోగించాలని సూచిస్తోంది. ఈ దిశగా మార్పులు చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఏమిటీ పాస్ కీస్ పాస్ కీస్ అనేవి క్రిప్టోగ్రాఫిక్ కీస్.
వీటిని వ్యక్తుల ఎలక్ట్రానిక్ పరికరాల్లోనే నిక్షిప్తం చేస్తారు. వీటిని ఆయా వ్యక్తుల బయోమెట్రిక్ డాటాతో లింక్ చేస్తారు. పాస్‌వర్డ్స్‌కు ప్రత్యామ్నాయంగా వీటిని ఫాస్ట్‌ ఐడెంటిటీ ఆన్‌లైన్ అలయన్స్ (ఎఫ్ఐడీఓ) రూపొందించింది. ఈ టెక్ సంస్థల కూటమిలో మైక్రోసాఫ్ట్‌తో పాటు యాపిల్, గూగుల్ కూడా భాగస్వాములే. ఈ వ్యవస్థలో ఫింగర్ ప్రింట్స్ వంటి బయోమెట్రిక్ సమాచారం కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో, పాస్ కీస్‌ను పాస్‌వర్డ్స్ లాగా మరోకరు వినియోగించేందుకు సాధ్యం కాదు. అంతేకాకుండా, రకరకాల పాస్‌వర్డ్స్‌ను గుర్తుంచుకోవాల్సిన బాధ యూజర్లకు తప్పుతుంది. ఇక మైక్రోసాఫ్ట్ కూడా లాగిన్ కోసం ఈ విధానం వైపు మళ్లుతోంది.
2015 నుంచే తాము ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పుకొచ్చింది. ఇప్పటికే తమ యూజర్లలో 99 శాతం మంది తమ విండోస్ అకౌంట్‌లో లాగిన్ అయ్యేందుకు పాస్ వర్డ్స్ వినియోగించరని తెలిపింది. ఇందుకు బదులుగా బయోమెట్రిక్స్ లేదా పిన్ నంబర్‌ను వినియోగిస్తు్న్నారని వెల్లడించింది. సంప్రదాయిక పాస్‌వర్డ్స్‌తో హ్యాకింగ్ బెడద ఎక్కువవుతోంది. ప్రస్తుతం సెకెనుకు 7 వేల పాస్‌వర్డ్ ఆధారిత హ్యాకింగ్ ప్రయత్నాలను తాము గుర్తిస్తున్నామని సంస్థ చెప్పుకొచ్చింది. 2023 నాటితో పోలిస్తే దాడుల సంఖ్య రెట్టింపైందని కూడా వెల్లడించింది. కొత్త టెక్నిక్‌ల ద్వారా పాస్‌వర్డ్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేస్తున్న నేరగాళ్లు సులువుగా హ్యాకింగ్ చేస్తున్నారు. దీంతో పాస్ వర్డ్స్‌కు బదులు వినియోగదారులు పాస్‌కీస్ వంటి మరింత భద్రమైన ప్రత్యామ్నాయాలవైపు మళ్లాలని మైక్రోసాఫ్ట్ సూచించింది.

ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Microsoft #NoMorePasswords #Passkeys #CyberSecurity #TechNews #DigitalSafety #MicrosoftUpdate #SecureLogin